ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలోని 28 ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు రూ.7.56 లక్షల నిధులు విడుదలైనట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం తెలిపారు. బుధవారం జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు, యువతకు గ్రంథాలయాలను చేరువ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. పైలెట్ ప్రాజెక్ట్లో భాగంగా జిల్లాలోని 28 ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు నిధులు కేటాయించారన్నారు. నిధులు ఆయా పాఠశాలల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయన్నారు. విద్యార్థుల్లో పఠనాసక్తి పెరగడంతో పాటు, విజ్ఞానం, పోటీ పరీక్షల సన్నద్ధతకు గ్రంథాలయాలు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు.


