Abhinay
-
పాస్టర్ అభినయ్ పై దాడి.! అసలేం జరిగింది.!!
-
నన్ను చంపాలని చూస్తున్నారు: పాస్టర్ అభినయ్
విశాఖపట్నం: పాస్టర్ ప్రవీణ్ పగడాల లాగే తనను చంపాలని చూస్తున్నారని భరోసా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ధార అభినయ్ దర్శన్ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు దర్యాప్తుపై తనకు నమ్మకం లేదని అన్నారు. తనపై దాడి చేసిన వారిని వదిలేసి, తన అనుచరులను పోలీసులు అరెస్టు చేశారని వాపోయారు. పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నందునే తనపై దాడి జరిగిందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.''నాపై నేనే దాడి చేసుకున్నట్లు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. నాపై దాడి విషయంలో పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారు. పాస్టర్లందరూ దొంగలే అనే తరహాలో చిత్రీకరిస్తున్నారు. నాపై దాడి వెనుక కుట్ర దాగి ఉంది. నాపై దాడి వ్యవహారంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుకి సంబంధం ఉందని అనుకోను. కొంతమందిపై నాకు అనుమానం ఉంది. వారి పేర్లు త్వరలోనే బయట పెడతాను. ప్రవీణ్ పగడాల నాలుగు బ్రాండ్లు తాగి యాక్సిడెంట్ చేసినట్లు దొంగ సాక్ష్యాలు సృష్టించారు. ప్రవీణ్ పగడాల విషయంలో జరిగింది పూర్తిగా అన్యాయమే. ప్రవీణ్ పగడాలపై వేసినట్టుగానే నాపై నిందలు వేస్తున్నారు. దాడులకు నేను భయపడను. ప్రజల సమస్యలపై ప్రభుత్వాధికారులను ప్రశ్నిస్తూనే ఉంటాన''ని అభినయ్ అన్నారు.దాడిని ఖండించిన పాడేరు ఎమ్మెల్యే పాస్టర్ అభినయ్‌పై దాడి చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. అభినయ్‌పై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభినయ్‌పై దాడి చేసిన వారిని ప్రజల ముందు పోలీసులు నిలబెట్టాలని కోరారు.''జరిగిన దాడిపై నేనే పోలీసులకు ఫోన్ చేసి పూర్తిస్థాయి విచారణ జరపాలని సూచించాను. ఈ దాడి తన అనుచరులు చేశారని కూటమి నాయకులు ప్రచారం చేయడం దురదృష్టకరం. ఒక గిరిజన బిడ్డపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కూటమి నేతలు నాకు క్షమాపణ చెప్పాలి. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక వైఎస్సార్సీపీపై అసత్య ప్రచారాలు చేస్తున్నార''ని విశ్వేశ్వరరాజు మండిపడ్డారు.అసలేం జరిగింది?అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలో మొండిగెడ్డ పంచాయతీ నీరుతోటపాలెం కాఫీ తోటల సమీపంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు అభినయ్‌పై దాడి చేశారు. కడపకు చెందిన అభినయ్ కొన్ని రోజులుగా జిల్లాలో ఉంటున్నారు. నీరుతోటపాలెంలో సమస్యలపై పాదయాత్ర చేసేందుకు సమావేశం ఏర్పాటు చేసి కారులో తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అభినయ్, ఆయనతో పాటు ఉన్న మరో ఇద్దరిని వాహనం నుంచి దింపి, కాఫీ తోటల సమీపంలోకి తీసుకెళ్లారు. అక్కడ అభినయ్‌పై బ్లేడుతో దాడి చేశారు. తల, కాళ్లపై కోసేశారు.అభినయ్‌తో పాటు ఉన్న ఇద్దరిపై కూడా దాడి చేశారు. వారికి స్వల్పగాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో అభినయ్ స్పృహ తప్పి పడిపోవడంతో మృతి చెంది ఉంటాడని భావించి, దుండ గులు వెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు వెంటనే అభినయ్‌ను జెర్రెల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వారు ఎవరో, ఎందుకు దాడి చేశారో తెలియడం లేదు. కడప నుంచి వచ్చిన అభినయ్‌కి ఇక్కడ ఎవరు శత్రువులున్నారో తెలియడం లేదని స్థానికులు తెలిపారు. అభినయ్ కారుపై కూడా దాడి చేయడంతో కారు అద్దం పగిలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నాపై దాడి వెనుక ఉన్నది.. ప్రవీణ్ పగడాలలా నన్ను కూడా చంపాలని...
-
మరణాన్ని ముందే ఊహించిన హీరో..
తమిళ హీరో అభినయ్ కింగర్ (44) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన సోమవారం (నవంబర్ 10న) చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. తన మరణాన్ని ఆయన ముందుగానే అంచనా వేశారు. కేవలం ఏడాది లేదా ఏడాదిన్నర మాత్రమే బతుకుతానని డాక్టర్స్ చెప్పారంటూ ఇటీవల ఓ వీడియోలో మాట్లాడారు. అందులో అతడు బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఈ వీడియో బయటకు వచ్చిన మూడు నెలలకే అభినయ్ మరణించడం విషాదకరం!ఎవరీ అభినయ్?ప్రముఖ మలయాళ నటి టి.పి.రాధామణి కుమారుడే అభినయ్ కింగర్ (Abhinay Kinger). తుళ్లువదో ఇళమై అనే తమిళ సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయమ్యారు. తమిళ చిత్రం 'జంక్షన్'తో హీరోగా మారారు. కానీ తర్వాత హీరోగా కంటిన్యూ కాలేకపోయారు. సక్సెస్, పొన్ మేఘలై, ఆరుముగం, సింగారా చెన్నై, ఆరోహణం వంటి పలు కోలీవుడ్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. మలయాళంలో కేవలం మూడే మూడు మూవీస్ చేశారు. చివరగా 2014లో వచ్చిన వల్లవణుక్కు పుళ్లం ఆయుధం సినిమాలో బిజినెస్‌మెన్‌గా కనిపించారు. అంతేకాకుండా మిలింద్ సోమన్, బాబు ఆంటోని, విద్యుత్ జమ్వాల్ వంటి నటులకు డబ్బింగ్ చెప్పారు. View this post on Instagram A post shared by Balan Akassh Balaiyan Jaganathan (@bjbala_kpy) చదవండి: 'పర్ఫామెన్స్ తక్కువ, డ్రామా ఎక్కువ'.. నామినేషన్స్‌లో ఎవరంటే? -
కొన్నిరోజులే బతుకుతా.. దీనస్థితిలో హీరో.. సాయం చేసిన కమెడియన్
సినిమా అనేది మాయా ప్రపంచం. స్టార్డమ్ ఉన్నంతకాలం వెండితెరపై ఓ వెలుగు వెలుగుతారు. కానీ ఫేడవుట్ అయ్యాక ఎవరూ పట్టించుకోరు. అప్పటిదాకా టిప్‌టాప్‌గా ఉన్న సెలబ్రిటీ బికారిగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చేతినిండా సంపాదించిన తారలు చేతులు చాచి సాయం కోసం అర్థించే దీన పరిస్థితులూ ఎదురు కావొచ్చు. పైన కనిపిస్తున్న హీరో ఇప్పుడలాంటి స్థితిలోనే ఉన్నాడు. తనకు సాయం చేయమని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాడు.సినిమాఇంతకీ ఆ హీరో మరెవరో కాదు అభినయ్ కింగర్ (Abhinay Kinger). మలయాళ ప్రముఖ నటి టి.పి. రాధామణి కుమారుడే అభినయ్. తళుల్లువదో ఇళమై సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు. జంక్షన్ అనే తమిళ మూవీలో హీరోగా నటించాడు. సక్సెస్, దాస్, పొన్ మేఘలై, సొల్ల సొల్ల ఇనిక్కుం, అరుముగం, ఆరోహణం వంటి పలు తమిళ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించాడు. మలయాళ సినిమాల్లోనూ యాక్ట్ చేశాడు. చివరగా 2014లో వచ్చిన వల్లవణుక్కు పుళ్లుం ఆయుధం సినిమా చేశాడు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేవిద్యుత్ జమ్వాల్, మిలింద్ సోమన్, బాబు ఆంటోని వంటి నటులకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తన గొంతు అరువిచ్చాడు. సినిమాలతో పాటు పలు వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపించాడు. అయితే అభినయ్.. దాదాపు దశాబ్దకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నాడు. ఇండస్ట్రీలో మంచి పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్న ఇతడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దానికి తోడు అతడి ఆర్థిక పరిస్థితి కూడా అస్సలు బాగోలేదు. ప్రభుత్వం నడిపే క్యాంటీన్లో తింటూ బతుకు నెట్టుకొస్తున్నాడు. పూట గడవడమే కష్టంగా ఉన్న ఇతడు కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇప్పుడా వ్యాధి ముదిరిందని, తాను కొంతకాలం మాత్రమే బతుకుతానని దీనంగా చెప్తున్నాడు.కొన్నాళ్లే బతుకుతా..తాజాగా ఈ నటుడి దుస్థితి గురించి తెలుసుకున్న తమిళ కమెడియన్ కేపీవై బాలా.. అభినయ్‌ను కలిసి రూ.1 లక్ష ఆర్థిక సాయం చేశాడు. ఈ సందర్భంగా అభినయ్.. నేను ఏడాదిన్నర మాత్రమే బతుకుతానని డాక్టర్స్ చెప్పారని తెలిపాడు. ఆ మాటతో భావోద్వేగానికి లోనైన బాలా.. నీకు తప్పకుండా నయమవుతుంది, మళ్లీ సినిమాలు చేస్తావు అని ధైర్యం చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ప్రేక్షకులు.. అభినయ్ బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడని అంటున్నారు. అభినయ్‌కు సాయం చేసినందుకు బాలాను మెచ్చుకుంటున్నారు. View this post on Instagram A post shared by Balan Akassh Balaiyan Jaganathan (@bjbala_kpy) చదవండి: జాతీయ సినీ అవార్డులు.. ప్రైజ్‌మనీ ఎంత? ఎవరికి ఏమేం ఇస్తారంటే? -
భారీ విస్తరణ దిశగా కిమ్స్..
• ఫిబ్రవరికల్లా ఒంగోలు ఆసుపత్రి పూర్తి • మరో మూడు రాష్ట్రాల్లోనూ ఏర్పాటు • కొత్తగా 4,000 మంది నియామకం • కిమ్స్ వైస్ ప్రెసిడెంట్ అభినయ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న కిమ్స్ హాస్పిటల్స్... ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో ఫిబ్రవరినాటికి 300 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తేనున్నట్లు తెలియజేసింది. రూ.60 కోట్లతో ఒంగోలులో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కొండాపూర్‌లోని 100 పడకల ఆసుపత్రికి ఇటీవలే రూ.40 కోట్ల ఖర్చుతో మరో 100 పడకలను జోడించారు. కొండాపూర్ ప్రాంతంలో నాణ్యమైన వైద్య సేవలకు డిమాండ్ పెరిగిందని, అందుకే విస్తరణ చేపట్టామని కిమ్స్ హాస్పిటల్స్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ అభినయ్ బొల్లినేని ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ‘‘ఇంకా గువహటి, భువనేశ్వర్, ఇండోర్ నగరాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని నిర్ణయించాం. ఇవి ఒక్కొక్కటి 250 పడకల సామర్థ్యంతో వస్తాయి. ఈ మూడు సెంటర్లకు రూ.450 కోట్ల దాకా వెచ్చిస్తాం. 2018 చివరికల్లా నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాం’’ అని అభినయ్ వివరించారు. ప్రస్తుతం సంస్థ వద్ద అన్ని విభాగాల్లో కలిపి 7,000 మందికిపైగా పని చేస్తున్నారు. ప్రతిపాదిత విస్తరణ పూర్తయితే ఈ సంఖ్య 11,000 దాటుతుందని ఆయన వెల్లడించారు. కిమ్స్‌కు తెలంగాణలో సికింద్రాబాద్, కొండాపూర్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళంలో ఆసుపత్రులున్నాయి. వీటి సామర్థ్యం 2,200 పడకలు. శ్రీకాకుళంలోని మెడికల్ కళాశాలకు అనుబంధంగా 500 పడకల ఆసుపత్రి ఉంది. -
ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య
గోదావరిఖనిలోని విఠల్‌నగర్‌లో అభినయ్(16) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వివాహం చేసుకున్న తల్లిదండ్రులను అమ్మమ్మ, తాతయ్య ప్రేమతో చేరదీయడలేదని మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘సహన’ తలరాత మారుద్దాం
హైదరాబాద్: అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి సహన తలరాతను మార్చేందుకు మేమున్నామంటూ వేలాది హృదయాలు ముందుకొచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లోని తెలుగువారు స్పందించడమే కాక.. చేతనైనంత సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. సికింద్రాబాద్ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన చిన్నారి సహనతోపాటు ఆమె కుటుంబ సభ్యులు పడుతున్న బాధలపై ‘తలరాతను మార్చుదాం’ శీర్షికతో ‘సాక్షి’ బుధవారం ప్రచురించిన కథనానికి విశేష స్పందన లభించింది. చిన్నారి సహన మోస్తున్న భారాన్ని తగ్గించేందుకు తమ వంతు బాధ్యతగా వేలాది చేతులు ఆపన్నహస్తం అందించాయి. ఆర్థికంగానేకాక మాట సాయం అందించి సహన కుటుంబానికి భరోసా కల్పించారు. హృదయాలను కదిలించే సహన కథనాన్ని మానవీయ కోణంలో ప్రచురించిన ‘సాక్షి’ యాజమాన్యానికి పలువురు కృతజ్ఞతలు తెలిపారు. అండగా నేనున్నా..: కేటీఆర్ చిన్నారి సహన కథనాన్ని చదవి రాష్ట్ర మంత్రి కె. తారకరామారావు చలించిపోయారు. బాధిత కుటుంబానికి అండగా తానుంటానని భరోసా ఇచ్చారు. బుధవారం ఫోన్ ద్వారా బాధిత కుటుంబ సభ్యులతో మంత్రి కార్యాలయ సిబ్బంది మాట్లాడారు. త్వరలోనే చిన్నారి సహనను స్వయంగా కలుస్తానని మంత్రి తెలిపారని, వైద్య చికిత్సల కోసం సీఎం సహాయనిధి నుంచి నిధుల మంజూరుకు చర్యలు చేపట్టాలని తమను అదేశించారని మంత్రి పీఏ తెలిపారు. కేటీఆర్ కార్యాలయ సిబ్బంది తమతో మాట్లాడి, భరోసా కల్పించడంపై సహన నాయనమ్మ లక్ష్మమ్మ హర్షం వ్యక్తం చేసింది. ఉచితంగా వైద్య సేవలు అందిస్తాం.. సహనకు అవసరమైన వైద్య సేవలను ఉచితంగా అందించేందుకు తిరుపతికి చెందిన రమాదేవి ఆస్పత్రి ముందుకొచ్చింది. ఆస్పత్రి ప్రతినిధి నవీన్ ఫోన్ ద్వారా సహన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రాజమండ్రి ప్రాణజ్ఞాన వైద్యాలయం ప్రతినిధి శిరీష మాట్లాడుతూ ఎటువంటి రుసుము లేకుండా ఆకుపసరు వైద్యంతో సహన సమస్యను పరిష్కరిస్తామన్నారు. సహన వైద్య సేవల నిమిత్తం ప్రతి నెలా రూ. 10 వేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామని గుంటూరు మదర్ థెరిసా ట్రస్ట్ ప్రతినిధి సాంబశివరావు తెలిపారు. సహన కుటుంబ సభ్యులు అంగీకరిస్తే ఆమె అక్కాచెల్లెళ్లను దత్తత తీసుకుని ఉన్నత చదువులు చదివిస్తామని హైదరాబాద్‌కు చెందిన సర్వనీడీ ఫౌండేషన్ ముందుకొచ్చింది. వారం రోజుల కూలి డబ్బును తన వంతు సాయంగా అందిస్తానని శ్రీకాకుళం నరసన్నపేటకు చెందిన కూలి నాగరాజు చెప్పాడు. హృదయాలను కదిలిచింది.. ‘సాక్షి’ వెబ్‌పోర్టల్‌లో సహన కథనం చదవి పలువురు ఆర్థిక సాయం అందించారు. కాలిఫోర్నియాలో ఉంటున్న కమలాకర్, ఆస్ట్రేలియాలో ఉంటున్న రాజేష్, చైనాలో ఉంటున్న ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన రమేష్ బ్యాంకు ద్వారా ఆర్థిక సాయం అందించారు. మరోవైపు చిన్నారి సహన సమక్షంలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించనున్నట్లు మహేష్‌బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధి అభినయ్ తెలిపారు. -
ఐస్‌క్రీమ్ ఇప్పిస్తానంటూ ఇంట్లోకి పిలిచి..
ఒంగోలు క్రైం : నగరంలోని సంతపేటలో ఓ ప్రైవేట్ స్కూలులో చదువుతున్న బాలిక పట్ల ఓ యువకుడు శుక్రవారం మధ్యాహ్నం అసభ్యంగా ప్రవర్తించాడు. సభ్యసమాజం తల దించుకునేలా వ్యవహరించిన అతడు బీటెక్ పూర్తి చేశాడు. ఓ జిల్లాస్థాయి ఉన్నతాధికారికి స్వయానా తమ్ముడు కుమారుడైన యూ.అభినయ్ తూర్పుగోదావరి జిల్లా గన్నవరానికి చెందినవాడు. ఒంగోలు తన పెదనాన్న వద్దకు వచ్చాడు. ఇంటి ముందుగా వెళ్తున్న ఏడేళ్ల చిన్నారిని ఐస్‌క్రీమ్ ఇప్పిస్తానంటూ ఇంట్లోకి పిలిచాడు. అభంశుభం తెలియని ఆ చిన్నారి ఐస్‌క్రీమ్ కోసం ఆశ పడి ఇంట్లోకి వెళ్లింది. అతడి వికృత చేష్టలకు బిత్తరపోయింది. పెద్దగా అరవాలని ప్రయత్నించగా బాలిక నోరు తన చేతులతో నొక్కి పట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం భోజనానికి రాలేదేంటా.. అని ఆ చిన్నారి తల్లి ఇంతలో స్కూలు వద్దకు వచ్చింది. స్కూలు యాజమాన్యాన్ని తన కుమార్తె విషయం అడిగింది. స్కూలు వదలగానే ఇంటికి వచ్చిందంటూ నిర్వాహకులు సమాధానమిచ్చారు. ఇంటికి రాలేదని చెప్పటంతో ఆ చిన్నారిని అందరూ కలిసి వెతుకులాట ప్రారంభించారు. ఒంగోలు టూటౌన్ బ్లూకోట్స్ టీమ్‌కు సమాచారం అందించారు. ఎం.రామకృష్ణ (ఆర్కే), సుబ్బారావుతో కూడిన బ్లూకోట్స్ టీమ్ స్కూలు వద్దకు చేరుకుంది. బాలిక ఇంటికి స్కూల్‌కు మధ్యలో ఉన్న ఇళ్లన్నీ వెతుకుతున్నారు. ఒక ఇంట్లో నుంచి చిన్నారి అరుపులు వినబడటంతో బ్లూకోట్స్ టీమ్ వెళ్లింది. బాలికను వదిలేసి అభినయ్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే బ్లూకోట్స్ పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. ఈలోగా పరిసర ప్రాంతాల వారు అతనిపై దాడికి దిగారు. అప్పటికే ఆ బాలిక తల్లితో పాటు పలువురు మహిళలు అతడిని చితకబాదారు. టూటౌన్ సీఐ వి.సూర్యనారాయణకు చేరవేయటంతో తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన అభినయ్‌ను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు వాహనంలో తరలించారు. -
చాటింగ్ గీతాలు
అభినయ్‌కృష్ణ, సునీత జంటగా.. టీఎస్ కమల్ దర్శకత్వంలో లావణ్య చంద్రశేఖర్ నిర్మిస్తున్న చిత్రం ‘చాటింగ్’. జయంత్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నాగబాబు ఆడియో సీడీని ఆవిష్కరించి, మంత్రి రుద్రరాజు పద్మరాజుకి అందించారు. సినిమా విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. హీరో అభినయ్ ఈ సినిమాకోసం ఎన్నో సాహసాలు చేశాడని దర్శకుడు అభినందించారు. ఇంకా నిర్మాత అశోక్‌కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


