పక్షవాత బాధితులూ నడవగలరు!.... మెదడుతోనే కంట్రోల్ చేయగల ఎక్సో స్కెలిటన్ ఇది. వీడియోలో చూపినట్లు పక్షవాతంతో బాధపడుతున్న వారు మళ్లీ నడిచేందుకు సాయపడుతుంది. రెండు పరికరాలను ఏర్పాటు చేయడం ద్వారా బాధితుడి మెదడులోని ఆలోచనలు ఎక్సో స్కెలిటన్‌కు చేరతాయి. కదలికలు సాధ్యమవుతాయి. అంటే... కాళ్లు కదపాలని అనుకుంటే చాలు.. కదిలిపోతాయి అన్నమాట. అలాగే చేతులు కూడా. ఫ్రాన్స్‌లోని గ్రీనోబెల్ యూనివర్శిటీలో క్లినిటెక్ అనే సంస్థ ఈ సరికొత్త ఎక్సో స్కెలిటన్ తాలూకూ ప్రయోగాలు నిర్వహిస్తోంది. కొన్ని చిన్న చిన్న సర్దుబాట్లు అవసరమైన ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే... పక్షవాతం మనిషి స్వేచ్ఛకు ఏమాత్రం ప్రతిబంధకం కాబోదు!
Video Credit: @mashable (Twitter)
వైరల్ వీడియో: పక్షవాత బాధితులూ నడవగలరు!
Oct 31 2023 11:19 AM | Updated on Mar 22 2024 10:45 AM
Advertisement