కోల్‌కతాకు చెందిన డాన్సింగ్ స్టార్ 14 ఏళ్ల అక్షత్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. అద్భుత ప్రదర్శనతో అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నాడు. టీవీల్లో డాన్స్ కార్యక్రమాలు వీక్షించే వారికి అక్షత్ సుపరిచితుడు. ఇండియా’స్ గాట్ టాలెంట్ టీవీ షోలో సల్మాన్ ఖాన్ పాటకు అతడు చేసిన డాన్స్ వీడియో వైరల్ కావడంతో 2014లో అక్షత్ పేరు మార్మోగిపోయింది. దాంతో అతడికి పలు టీవీ షోల్లో పాల్గొనే అవకాశాలు దక్కాయి. తాజాగా బ్రిటన్స్ గాట్ టాలెంట్ షోలో అక్షత్ అదరగొట్టాడు. తన డాన్స్, హావభావాలతో అందరినీ మంత్రముగ్ధులను చేశాడు. జడ్జిలతో పాటు ప్రేక్షకులంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అతడిని ప్రశంసించారు. కుమారుడి ప్రతిభను కళ్లారా చూసి అక్షత్ తల్లి ఆనంద భాష్పాలు రాల్చారు. అక్షత్ సింగ్ తాజా డాన్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వామ్మో.. డాన్స్ ఇరగదీశాడు!
Apr 26 2019 1:53 PM | Updated on Apr 26 2019 1:59 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement