సాధారణంగా పెళ్లంటే కొందరికి పెద్ద సంబరం. ముందే అనుకొని చేసుకునే పెళ్లిల్లయితే కాస్త చీకు చింత లేకుండా చేసుకుంటారు.. కానీ, అనూహ్యంగా చేసుకోవాల్సి వచ్చిన పెళ్లిళ్లయితే మాత్రం కొందరికి పట్టరాని సంతోషాన్నివ్వగా మరికొందరికి మాత్రం విషాదంగా కనిపిస్తాయి. బిహార్‌లో ఓ యువకుడి జీవితంలోకి మాత్రం అనుకోని, అనుకోకుండా కాకుండా.. ఓ బుల్లెట్‌లాగా పెళ్లి దూసుకొచ్చింది. సరదాగా పెళ్లికి వెళ్లి తిరుగు పయానమైన అతడు పెళ్లికొడుగ్గా మారాల్సి వచ్చింది. బోరుమని ఏడుస్తూ తన పక్కన తెలిసిన వారే లేకుండా తనపైకి ఎక్కుపెట్టిన తుపాకీని చూస్తూ తాళికట్టాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. వినోద్ కుమార్ అనే యువకుడు బొకారో స్టీల్ ప్లాంట్‌లో జూనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.