గాయం నుంచి కోలుకున్న తర్వాత పరుగులు రాబట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, గురువారంనాటి మ్యాచ్‌తో తిరిగి పుంజుకున్నానని శిఖర్ ధవన్ చెప్పాడు. ఐపీఎల్ 2018లో భాగంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్(50 బంతుల్లో 92 పరుగులు) ఆడిన ధవన్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. సన్‌రైజర్స్ జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చిన ఈ విజయం ఆనందకరమే అయినా.. ఢిల్లీ ఓటమి ఒకింత బాధకలిగించిందని మ్యాచ్ అనంతరం అన్నాడు.