రెండో టెస్ట్: పుంజుకున్న వెస్టిండీస్‌ జట్టు | Roston Chase Leads West Indies Fight Back Against India In 2nd Test | Sakshi
Sakshi News home page

రెండో టెస్ట్: పుంజుకున్న వెస్టిండీస్‌ జట్టు

Oct 12 2018 7:59 PM | Updated on Mar 20 2024 3:46 PM

తొలి టెస్టులో ఘోర ఓటమి తర్వాత పర్యాటక వెస్టిండీస్‌ జట్టు పుంజుకుంది. శుక్రవారం ఆరంభమైన రెండో టెస్టులో విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ తొలుత తడబడినా.. చివరికి నిలబడి జట్టుకు భారీ స్కోర్ అందించే ప్రయత్నం చేశారు. టీమిండియాతో ఉప్పల్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రోస్టన్‌ ఛేజ్‌ (98 బ్యాటింగ్‌), కెప్టెన్‌ హోల్డర్‌(52) రాణించడంతో తొలి రోజు ఆటముగిసే సమయానికి కరీబియన్‌ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement