పాండే సూపర్‌ క్యాచ్‌! | Sakshi
Sakshi News home page

పాండే సూపర్‌ క్యాచ్‌!

Published Wed, Sep 19 2018 7:05 PM

ఆసియాకప్‌లో భాగంగా దాయాదీ పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్‌ మనీష్‌ పాండే అద్భుత క్యాచ్‌తో ఔరా అనిపించాడు. కేదార్‌ జాదవ్‌ వేసిన 25 ఓవర్‌ ఐదో బంతిని పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్ అహ్మద్‌ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే ఆ దిశగా బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న మనీష్‌ పాండే పరుగెత్తుకుంటూ వచ్చి అద్భుతంగా బంతిని అందుకున్నాడు. అయితే బ్యాలెన్స్‌ కోల్పోతున్నట్లు భావించిన పాండే బంతిని గాల్లోకి విసిరేసి బౌండరీ లైన్‌ను దాటి మళ్లీ వచ్చి క్యాచ్‌ అందుకున్నాడు. ఈ అద్భుత ఫీట్‌తో మైదానంలో ప్రేక్షకులు.. ఆటగాళ్లు థ్రిల్‌ అయ్యారు. దీంతో సర్ఫరాజ్‌ (6) పెవిలియన్‌ చేరాడు.