ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి విషయంలో ప్రభుత్వంపై టీడీపీ నేతలు విమర్శలను ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రంగా ఖండించారు. విజయవాడలో సోమవారం జరిగిన విలేకరు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నేతలు సిగ్గులేకుండా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, బుద్ది లేకుండా ప్రభుత్వ హత్య అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కోడెల మరణానికి ఆయన కుటుంబ సభ్యులే కారణమని ఆయన బంధువులు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.