మహిళలు, బాలికలపై దాడులకు నిరసనగా శనివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ అంతటా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించబోతున్నట్టు ఆ పార్టీ సీనియర్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 13 జిల్లాల్లో రేపు సాయంత్రం 6.30 గంటలకు కొవ్వొత్తుల ర్యాలీ చేపడతామని వివరించారు.