కనకదుర్గమ్మ దుర్గ గుడిలో వైఎస్‌ జగన్‌ పూజలు

కొలిచెడి వారికి కొంగు బంగారంగా భావించే బెజవాడ కనకదుర్గమ్మను ఆంధ్రప్రదేశ్‌ నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా ఆయన అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. అంతకు ముందు ఆలయ సంప్రదాయం ప్రకారం ఈవో కోటేశ్వరమ్మతో పాటు వేదపండితులు జగన్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయనతో పాటు పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌, పొట్లూరి వరప్రసాద్‌ తదితరులు ఉన్నారు. కాగా కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకున్న ఆయన అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఇంద్రకీలాద్రికి వచ్చారు. అమ్మవారి దర్శనం అనంతరం విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అవుతారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top