మరోసారి చంద్రబాబు నాయుడికి ఓటువేస్తే సర్వం దోచేస్తారని వైఎస్సార్ కాంగ్సెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఐదేళ్ల పాలనలో ఆయన చేసిన అధివృద్ధి శూన్యమని, ఏం చేశారని మరోసారి ఓటువేయ్యాలని ప్రశ్నించారు. చంద్రబాబు మరోసారి అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉండవని, పంటలకు గిట్టుబాటు ధర ఉండదని, మహిళలకు డ్వాక్రా రుణాలు ఉండవని వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.