ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పెన్షన్ల పెంపుదలపై తొలి సంతకం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం వైఎస్సార్ పెన్షన్ కానుక పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా వృద్ధుల పెన్షన్ వయస్సు 65 నుంచి 60 సంవత్సరాలకు కుదించారు. ఈ మేరకు శుక్రవారం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సర్కారు తొలి జీవో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అర్హులందరికీ జూలై 1 నుంచి కొత్త పెన్షన్ పథకం అందుతుంది. వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం కింద వృద్ధులకు రూ. 2250, వికలాంగులకు రూ. 3 వేలు, కిడ్నీ బాధితులకు రూ. 10 వేలు చెల్లిస్తారు.
‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ పథకం ప్రారంభం
May 31 2019 2:13 PM | Updated on Mar 21 2024 8:18 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement