ఎన్నికల వేళ జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అభిమానులు కొండంత అండగా నిలుస్తున్నారు. నీకు మేమున్నామంటూ రాజన్న బిడ్డకు తోడుగా వస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన వైఎస్ జగన్‌ను కడప విమానాశ్రయంలో లింగాల మండలం పెద్ద కూడలకు చెందిన అనిల్ అనే అభిమాని కలిశారు. 5 లక్షల రూపాయల చెక్కును అందించి అభిమానం చాటుకున్నారు.