రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భూమా శోభానాగిరెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళి అర్పించారు. ప్రత్యేక హెలికాప్టర్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆళ్లగడ్డ చేరుకున్న జగన్... శోభానాగిరెడ్డి పార్థీవదేహాన్ని సందర్శించి అంజలి ఘటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, జగన్ సతీమణి వైఎస్ భారతి, జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా శోభానాగిరెడ్డి భౌతికకాయానికి నివాళి అర్పించారు. శోభానాగిరెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. కన్నీటి పర్యంతమవుతున్న శోభానాగిరెడ్డి కుమార్తెలు, కుమారుడిని జగన్ ఓదార్చారు. వైఎస్సార్ సీపీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు శోభానాగిరెడ్డి పార్థీవదేహానికి అంజలి ఘటించారు. మరోవైపు శోభానాగిరెడ్డిని చివరిసారిగా దర్శించుకునేందుకు భారీలో కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితులు ఆళ్లగడ్డకు తరలివచ్చారు.
Apr 25 2014 3:47 PM | Updated on Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement