వైరల్‌: ఆకాశ్‌ అంబానీ పెళ్లి పత్రిక

‘ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి’ బహుశా ప్రస్తుతం ఇలాంటి పాటలనే అంబానీ కుటుంబ సభ్యులు పాడుకుంటున్నారనుకుంటా. ఎందుకంటే అంబానీ ఇంట వివాహమంటే అందరిలోనూ భారీగానే అంచనాలే ఉంటాయి. దీంతో ఆహ్వాన పత్రికల నుంచి మొదలు వివాహ వస్త్రాలు, ఆభరణాలు, పెళ్లి పందిరి, సంగీత్‌, మెహందీ, వివాహ వేడుకలు ఇవన్నీ వార్తల్లో నిలిచేవే. రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ- నీతాల గారాల పట్టి ఈశా వివాహ వేడుకలను జనం మరువకముందే మరో వేడుకకు అంబానీ కుటుంబం సిద్దమైంది. ఆకాశ్‌ అంబానీ వివాహం వజ్రాల వ్యాపారి రస్సెల్‌​ మెహతా కుమార్తె శ్లోకా మెహతాతో మార్చి 9న జియో వరల్డ్‌ సెంటర్‌ వేదిక జరగనున్న విషయం తెలిసిందే. (అంబానీ ఇంటి వివాహం : మొదటి ఆహ్వానం ఆయనకే!)

ఇక ఇప్పటికే పెళ్లి పనులు మొదలు కాగా.. అతిథులను ప్రత్యేకంగా పిలిచే పనిలో పడ్డారు. ఇక తొలి వివాహ ఆహ్వాన పత్రికకు సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం అతిథులను ఆహ్వానిస్తున్నారు. అయితే వీరి పెళ్లి పత్రికకు సంబంధించి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసింది. ఇప్పడు దానికి సంబంధించి మరో వీడియో కూడా హాట్‌ టాపిక్‌గా మారింది. అత్యంత గ్రాండ్‌ డిజైన్‌ చేసిన ఈ పత్రికలో ముఖేశ్‌-నీతా అంబానీలు స్వహస్త్రాలతో రాసిన లేఖ తొలుత దర్శనమిస్తుంది. అనంతరం వివాహానికి సంబంధించిన వివరాలు, అతిథలుకు ఇచ్చే బహుమతులు కనిపిస్తాయి. కృష్ణుడు, గణపతి పాటలు బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంటాయి. దీంతో ఈ పత్రిక చూపరులను తెగ ఆకట్టుకుంటోంది. ‘ఎంతైనా అంబానీ ఇంట పెళ్లి కదా.. ఆ మాత్రమైనా ఉండాలి’ అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top