ఆర్టీసీ బస్సులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్న ఓ యువకుడిని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య కులం పేరుతో దూషించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడున్న అధికారులు, టీడీపీ నేతలు అవాక్కయ్యారు. ఈ ఘటన గురువారం కృష్ణాజిల్లా మచిలీపట్నం బస్టాండ్ అవరణలో చోటుచేసుకుంది.