‘అమ్మఒడి’ ఒక గొప్ప సంస్కరణ పథకమని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టి లో ఉంచుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘అమ్మఒడి’ పథకాన్ని తీసుకువచ్చారని పేర్కొన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. పేదల భవిష్యత్ మార్చేందుకు అమ్మ ఒడి పథకం ఉపయోగపడుతుందన్నారు. పేద ప్రజలు, రైతులు కూలీలు మాత్రమే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తారని, అలాంటి వారికి ‘అమ్మఒడి’ భరోసా ఇచ్చిందన్నారు. ఈ పథకం వల్ల డ్రాపౌట్స్ తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.
‘అమ్మఒడి’ ఒక గొప్ప సంస్కరణ పథకం
Jan 21 2020 4:25 PM | Updated on Jan 21 2020 4:32 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement