రాజస్థాన్ బీజేపీలో కలకలం రేగింది. బీజేపీ చేపట్టిన గౌరవ్‌యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి వసుంధర రాజే వేదికపై మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగింది. రాష్ట్ర అసెంబ్లీకి డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గౌరవ్‌యాత్ర చేపట్టారు. సమావేశం కొనసాగుతుండగానే రోహిత్ శర్మ, దేవీసింగ్ షెకావత్ మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ తలెత్తింది. అది తీవ్ర రూపం దాల్చడంతో ఇద్దరూ ఒకరిపైఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు.