యూ.కొత్తపల్లి పోలిస్‌స్టేష్‌న్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న గ్రామస్తులపై పోలీసులు లాఠీ చార్జి చేయడంతో ఓ మహిళ సొమ్మల్లి పడిపోయికంది. వివరాలు.. గత నెల 11న ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. పోలింగ్ రోజున పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.