తెలంగాణ ఇంటర్మీడియెట్‌ ఫలితాలు విడుదల | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఇంటర్మీడియెట్‌ ఫలితాలు విడుదల

Published Fri, Apr 13 2018 9:44 AM

తెలంగాణలో ఇంటర్మీడియెట్‌ ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. ఉప ముఖ్యమంత్రి కడియం  శ్రీహరి ఇంటర్‌ బోర్డు కార్యాలయ ఆవరణలో  ఉదయం 9 గంటలకు ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఇంటర్‌ ఫస్టియర్‌లో 62.35 శాతం ఉత్తీర్ణులు కాగా, సెకండియర్‌లో 67.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.యథావిధిగా ఈసారి కూడా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు.

ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సారి ఉత్తీర్ణత శాతం పెరిగినట్లు తెలిపారు. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ దరఖాస్తుకు ఏప్రిల్ 20 వరకు గడువు విధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇకపై ప్రభుత్వ కళాశాలల్లో జేఈఈ, నీట్‌లకు ప్రత్యేక కోచింగ్‌ ఇవ్వనున్నట్లు కడియం శ్రీహరి తెలిపారు.

Advertisement
Advertisement