ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర మంత్రులు, అధికార టీడీపీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. సమస్యలపై నిలదీస్తే మహిళా ఉద్యోగులనే కాదు, పార్టీకి చెందిన మహిళా నేతలను సైతం వదిలిపెట్టని ఘటనలు ఏపీలో నిత్యం కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో విజయనగరం జిల్లాలో తమ సమస్య తీర్చాలని కోరినందుకు ఓ టీడీపీ నేత బూతు పురాణం మొదలెట్టడంతో స్థానికులు కంగుతిన్నారు. జిల్లాలోని పార్వతీపురం మున్సిపాలిటీలో సమస్యలపై ప్రశ్నించగా ఉద్రిక్త వాతావారణం నెలకొంది. మమ్మల్నే నిలదీస్తారా అంటూ టీడీపీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్ దాడికి దిగి దాష్టీకానికి పాల్పడ్డారు.