మంత్రి నారా లోకేశ్‌కు తగ్గ శిష్యుడు దొరికాడంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. హైటెక్ ముఖ్యమంత్రినని చెప్పుకునే చంద్రబాబుకు కొడుకుగా తొలినుంచీ సోషల్ మీడియాలోదూసుకుపోతున్న లోకేశ్‌పై అదే స్థాయిలో విమర్శలు, జోకులు పేలుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన అభిమాని ఒకరు చేసిన ప్రసంగం వైరల్‌గా మారింది. బుధవారం లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.