ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ నిర్ణయం చరిత్రాత్మకమని ఆ పార్టీ నేత తమ్మినేని సీతారాం అభివర్ణించారు. సోమవారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రతిపక్ష సభ్యుల పేర్లను, స్థానాలను అసెంబ్లీ ప్రకటించాల్సిన అవసరం ఉందని అన్నారు. లేకపోతే కళంకిత స్పీకర్ గా కోడెల చరిత్రలో మిగిలిపోతారని తమ్మినేని తెలిపారు.