కడుపు మాడ్చుకుంటే కాని తెలంగాణ ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందనిదని బీజేపీ నేత, మాజీమంత్రి డీకే అరుణ తీసుకున్న ఉక్కు సంకల్పం గొప్పదని స్వామి పరిపూర్ణానంద అన్నారు. కాగా తెలంగాణలో మద్యం నిషేధించాలని డిమాండ్ చేస్తూ డీకే అరుణ ఇందిరా పార్క్ వద్ద 'మహిళా సంకల్ప దీక్ష' పేరుతో దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం ఆమె దీక్ష విరమించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వామి పరిపూర్ణనంద మాట్లాడుతూ...‘ దిశ అనే యువతి భూమి మీదే నరకాన్ని చూసింది. దిశ నిందితులది ఎన్‌కౌంటర్ కాదు. ఒకరకంగా చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. ఎన్‌కౌంటర్ చేసింది పోలీసులు కాదు...ప్రజల తీర్పు.