పదోన్నతి కల్పించే విషయంలో జిల్లా పరిషత్ సీఈవో నగేశ్ వేధింస్తున్నారని ఆరోపిస్తూ జడ్పీ చైర్‌పర్సన్ ధనలక్ష్మీ పీఏగా పనిచేస్తున్న సంతోష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. జడ్పీ చైర్మన్ మీడియా సమావేశం ఉందని మీడియాను పిలిపించి.. వారి సమక్షంలోనే పురుగుల మందు తాగారు. సహచర ఉద్యోగులు, మీడియా సిబ్బంది సంతోష్‌ను అడ్డుకొని పురుగుల మందు బాటిల్‌ను లాక్కున్నారు. అనంతరం సంతోష్‌ను ఆస్పత్రికి తరలించారు.