రాజకీయ నైతిక విలువలకు కట్టుబడి ఎమ్మెల్సీగా గెలిచిన 90 రోజుల్లోనే పదవికి రాజీనామా చేశారని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన శాసససభలో మాట్లాడుతూ.. దేశ చరిత్రలో అతి తక్కువ రోజుల్లో రాజీనామా చేసిన మండలి సభ్యుడిని తానేఅని తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా తాము వైఎస్సార్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్నామని.. అయితే టీడీపీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేస్తేనే తమ పార్టీలో చేర్చుకుంటామని వైఎస్ జగన్ చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు. ఆయన సూచన మేరకు, విలువలకు గౌరవించి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని పేర్కొన్నారు. గత ప్రభుత్వం నైతిక విలువలు అనే పదానికి అర్థం లేకుండా చేసిందని.. చట్టాలను చుట్టాలుగా మార్చుకుని అనేక అవినీతి చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు.