మంగళూరు రోడ్లపై ప్రమాదకరమైన జంతువులు దర్శనమిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా కర్ణాటకలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వీధులు నీటితో నిండిపోయాయి. దీంతో జనావాసాలకు దూరంగా ఉండాల్సిన పాములు, షార్క్‌లు రోడ్డుపైకి వచ్చేస్తున్నాయి. వర్షాల కారణంగా అరేబియన్ సముద్రంలో భారీ అలలు ఎగసిపడటంతో సముద్రపు నీటితో పాటు ఆరు అడుగుల పొడవైన షార్క్ ఒకటి మంగళూరు వీధుల్లోకి వచ్చి పడింది.