టీడీపీ రాక్షస పాలనలో మహిళలను రక్షణలేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ప్రశ్నించినందుకు తనను అసెంబ్లీ నుంచి బహిష్కరించారని మండిపడ్డారు. మంత్రిస్థానంలో ఉండి పరిటాల సునీత మహిళలను వేధించడం దుర్మార్గమన్నారు. రాప్తాడులో కుటుంబ పాలన జరగుతోందని, పరిటాల వర్గీయులు హింసా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మహిళల మంగళసూత్రాలు తెగిపడుతున్నా మంత్రులు సునీత, అఖిలప్రియ స్పందించకపోవడం దారుణమన్నారు.