‘రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తాం..!’ | Revanth reddy reached to Kodangal, will talk to media on sunday | Sakshi
Sakshi News home page

‘రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తాం..!’

Published Sat, Oct 28 2017 8:36 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామాను ప్రకటించిన తర్వాత తొలిసారి కొడంగల్‌కు వచ్చిన రేవంత్‌రెడ్డికి అభిమానులు సాదరస్వాగతం పలికారు. టీడీపీ చీఫ్‌ చంద్రబాబుతో సమావేశం కోసం విజయవాడ వెళ్లిన రేవంత్‌.. ముఖాముఖి భేటీ లేకుండానే శనివారం రాత్రి కొడంగల్‌కు వచ్చేశారు. రేవంత్‌ ఇంటివద్ద వందల సంఖ్యలో గుమ్మికూడిన అభిమానులు.. ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఆదివారం ఉదయం ప్రెస్‌మీట్‌ : తనకోసం ఎదురుచూసిన కార్యకర్తలు, మీడియాను ఉద్దేశించి రేవంత్‌ మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు రాత్రైపోయింది. చీకట్లో అందరూ జాగ్రత్తగా ఇళ్లకు వెళ్లండి. రేపు(ఆదివారం) పొద్దున 9గంటలకు అన్ని విషయాలు మాట్లాడుతాను. తప్పకుండా అందరూ రండి’’ అని చెప్పారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement