ఫీజుల పెంపును నిరసిస్తూ గండిపేట సీబీఐటీ కాలేజీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఐదురోజులుగా కొనసాగుతున్న ఆందోళన సోమవారం ఉద్రిక్తతలకు దారితీసింది. ఫీజుల పెంపును నిరసిస్తూ విద్యార్థులు సోమవారం రోడెక్కారు. వీరి ఆందోళనకు ఏబీవీపీ, విద్యార్థుల తల్లిదండ్రులు మద్దతు తెలిపారు.