రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతూ.. ప్రజా సమస్యలను ఆలకిస్తూ.. వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 297వ రోజు షెడ్యూల్‌ఖరారైంది. జననేత చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం సాలూరు నియోజకవర్గంలోని తామరఖండి శివారు నుంచి జననేత పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి చినభోగిలి, సీతానగరం, అప్పయ్యపేట, జోగింపేట, గుచ్చిమి మీదుగా చినరాయుడు పేట వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటనవిడుదల చేశారు.
297వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
Nov 14 2018 7:16 AM | Updated on Mar 22 2024 11:16 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement