ఎన్నికల కోడ్ సడలించిన ఈసీ

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సడలించింది. ఫొని తుపాను కారణంగా సహాయక చర్యలు, పునరావాస చర్యల కోసం సీఈసీ శుక్రవారం ఎన్నికల కోడ్‌ ఎత్తివేసింది. తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు మినహాయింపు ఇస్తూ ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇచ్చింది. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగగా, ఓట్ల లెక్కింపు ఈ నెల 23వ తేదీన జరగనుంది. అప్పటి వరకూ ఉన్న ఎన్నికల కోడ్‌ను ప్రస్తుతం ఫొని తుపాను కారణంగా నాలుగు జిల్లాల్లో రద్దు చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top