ఆర్థిక లావాదేవీ నేపథ్యంలో హత్యకు గురైన జయరామ్ కేసులో రాకేష్‌రెడ్డి ప్రధాన నిందితుడని తేలడంతో కుత్బుల్లాపూర్‌లో కలకలం రేగింది. వివాదాస్పదుడిగా ముద్రపడిన రాకేష్ రెడ్డిపై గతంలో కూకట్‌పల్లి, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. టీడీపీ నాయకుల వెంట తిరుగుతూ అటు ఏపీ సీఎం చంద్రబాబు, అతడి తనయుడు లోకేష్ పేర్లు చెప్పుకుని హైదరాబాద్‌లో పలు సెటిల్‌మెంట్లకు పాల్పడినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ నేతలకు టికెట్లు ఇప్పించడం మొదలు, ప్రచారంలో సైతం అన్నీ తానై వ్యవహరించాడు. కుత్బుల్లాపూర్‌లో జరిగిన బహిరంగ సభల్లో ఏపీ సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో రాకేష్‌రెడ్డిని పొగడడం విశేషం.