పోచంపల్లిలో రంగమ్మత్త | Pochampally Yadadri- Anchor Anasuya Visit handloom Workers | Sakshi
Sakshi News home page

పోచంపల్లిలో రంగమ్మత్త

Jul 28 2018 9:31 AM | Updated on Mar 20 2024 1:43 PM

పోచంపల్లిలో సినీనటి, ప్రముఖ యాంకర్‌ అనసూయ(రంగమ్మత్త) సందడి చేశారు. చేనేత ప్రోత్సాహక మండలి అధ్యక్షుడు, చేనేత దినోత్సవ రూపకర్త ఎర్రమాద వెంకన్న ఆధ్వర్యంలో శుక్రవారం ఆమె పోచంపల్లిలోని మహామ్మాయి కాలనీలోని పలు చేనేత కార్మికుల గృహాలను సందర్శించారు. అక్కడ నూలు, చిటికి, రంగులద్దకం, మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాలను పరిశీలించారు. కార్మికులతో ముచ్చటిస్తూ ఎన్నాళ్లుగా ఈ వృత్తిలో కొనసాగుతున్నారు.. ఎంత గిట్టుబాటు అవుతుందనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. మగ్గం నేసి, కండెలు చుట్టి కార్మికులను ఉత్సాహపరిచారు. అనంతరం కళాత్మకంగా చేనేత వస్త్రాలు రూపొందిస్తున్న ఆరుగురి కార్మిక కుటుంబాలను పూలమాలతో సన్మానించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement