ఉత్తరప్రదేశ్‌లోని సహ్రాన్ పూర్‌లో మే 9వ తేదీన జరిగిన దళితుడైన సచిన్ వాలియా అనుమానాస్పద మృతిపై పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. ఎఫ్‌ఐఆర్‌లో ప్రధాన నిందితుడిగా ‘బందిపోటు రాణి’ పూలన్ దేవీ హంతకుడైన షేర్ సింగ్ రాణా పేరును పేర్కొనడమే అందుకు కారణం. మరోపక్క చనిపోయిన దళితుడు కూడా సామాన్యుడు కాదు. ‘భీమ్ ఆర్మీ’ సహ్రాన్‌పూర్ జిల్లా చీఫ్ కమల్ వాలియా సోదరుడు సచిన్ వాలియా(25).