తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనతో రెవెన్యూ ఉద్యోగులు హడలిపోతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దార్ ఉమామహేశ్వరి తన చాంబర్‌లో అడ్డంగా తాడు కట్టించి.. అర్జీలు ఇచ్చేవారు ఎవరైనా తాడు బయట నుంచే ఇవ్వాలని, లోపలికి ఎవర్నీ అనుమతించవద్దని సిబ్బందిని ఆదేశించారు. తహసీల్దార్ హడావుడి చూసి కార్యాలయ సిబ్బందితో పాటు వచ్చిన ప్రజలు ఆశ్చర్యపోయారు. ఈ విషయమై తహసీల్దార్‌ను విలేకరులు వివరణ అడగ్గా.. ‘మా జాగ్రత్త మేం తీసుకోవాలి కదా’ అన్నారు.
ముందు జాగ్రత్తలు తీసుకుంటున్న రెవెన్యూ అధికారులు
Nov 6 2019 1:41 PM | Updated on Nov 6 2019 2:55 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement