పదమూడేళ్ల బాలికపై ఓవృద్ధుడు అత్యాచారం చేసిన సంఘటన హబీబ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ పరవస్తు మధుకర్ స్వామి తెలిపిన వివరాల ప్రకారం... ఆగాపురాలో అబ్దుల్ వహబ్ (76) అనే వృద్ధుడు నివాసముంటున్నాడు. సౌదీ అరేబియా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడు. అతనికి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వీరంతా సౌదీ అరేబియాలోనే ఉంటున్నారు. వహబ్ మాత్రం కోడలితో పాటుగా ఆగాపురాలో ఉంటున్నాడు. బుధవారం కోడలు ఇంట్లో లేని సమయంలో అతను బస్తీకి చెందిన 13 ఏళ్ల అమ్మాయికి చాక్లెట్ ఇస్తానంటూ నమ్మించి ఇంట్లోకి పిలిచి అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలు హబీబ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు
బాలికపై వృద్ధుడి లైంగిక దాడి
Mar 2 2018 1:02 PM | Updated on Mar 21 2024 7:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement