అమెరికాలోని తమ దేశ ప్రత్యేక రాయబారి కిమ్ హయెక్ చోల్‌కు ఉత్తర కొరియా మరణశిక్ష అమలు చేసింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ను మోసం చేశారన్న ఆరోపణలతో ఆయనకు మరణశిక్ష అమలు చేసినట్టు దక్షిణ కొరియా న్యూస్‌పేపర్ ‘ది చోసన్ ఎల్బో’ వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య వియత్నాం రాజధాని హనోయ్‌లో జరిగిన రెండురోజుల శిఖరాగ్ర సదస్సులో హయెక్ చోల్ కీలకంగా వ్యవహరించారు. కిమ్‌తో పాటు ఆయన ప్రైవేటు రైలులో ప్రయాణించి హనోయ్ చేరుకున్నారు.