టీడీపీకి గుడ్‌బై చెప్పిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎల్లుండి (మంగళవారం) కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన పార్టీలో చేరే అవకాశముంది. రేవంత్ రాకపై కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. డీకే అరుణ వంటి పలువురు నేతలు ఆయన రాకను వ్యతిరేకించినట్టు కథనాలు వచ్చాయి. తాజాగా ఈ విషయమై తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కుంతియ వివరణ ఇచ్చారు.