ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై గత ఏడాది అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఉద్దేశ పూర్వకంగా జరిగిందేనని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తేల్చి చెప్పింది. ఆ దాడి గురి తప్పకపోయుంటే మరణం సంభవించి ఉండేదని, అందుకే జగన్‌పై జరిగిన దాడిని రాష్ట్ర పోలీసులు హత్యాయత్నంగా పరిగణిస్తూ, ఆ మేరకు ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారని వివరించింది.