ముందస్తుకు మేం సిద్ధం | Muralidhar Rao sensational comments on TRS Party | Sakshi
Sakshi News home page

ముందస్తుకు మేం సిద్ధం

Sep 5 2018 7:20 AM | Updated on Mar 22 2024 11:07 AM

టీఆర్‌ఎస్‌పై పోరుకు తమ పార్టీ అధినాయకత్వం పచ్చజెండా ఊపిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు తెలిపారు. ఆ పార్టీపై పోరాడేందుకు మండలస్థాయిలో చార్జ్‌షీట్‌ యాత్రలు చేపట్టనున్నామని చెప్పారు. తెలంగాణలో శాసనసభకు ఎన్నికలు ముందస్తుగా వచ్చినా, ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మంగళవారం ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్లుగా సంస్థాగతంగా, క్రమబద్ధంగా క్షేత్రస్థాయి నుంచి పైవరకు పార్టీని బలోపేతం చేసినట్టు తెలిపారు. సెప్టెంబర్‌ 2న టీఆర్‌ఎస్‌ జరిపిన బహిరంగ సభలో వాగ్దానాలపై సీఎం కేసీఆర్‌ ఎలాంటి చర్చ చేయలేదని, చర్చ జరపకపోవడమే టీఆర్‌ఎస్‌ వైఫల్యానికి నిదర్శనమన్నారు.  

Advertisement
 
Advertisement

పోల్

Advertisement