నిందితులు నా నుండి తప్పించుకోలేరు | MLA Raja Singh Comments On Disha Case | Sakshi
Sakshi News home page

నిందితులు నా నుండి తప్పించుకోలేరు

Dec 4 2019 8:33 PM | Updated on Dec 4 2019 8:39 PM

హైదరాబాద్‌ : దిశ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులను ఊరి తీయాలనే డిమాండ్‌ ప్రధానంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే దిశ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దిశ కేసు నిందితులు కోర్టు నుంచి తప్పించుకున్నా, జైలు నుంచి తప్పించుకున్నా, తన నుంచి తప్పించుకోలేరని రాజా సింగ్‌ హెచ్చరించారు. దిశను ఎంత దారుణంగా హత్య చేశారో.. నలుగురు నిందితులను అదే విధంగా శిక్షిస్తామని చెప్పారు.

కాగా, ఈ కేసు విచారణను వేగవంతంగా పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మహబూబ్‌నగర్‌లో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయనుంది. మరోవైపు షాద్‌నగర్‌ కోర్టు దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను వారం రోజులపాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీచేసింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement