ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వీ సుబ్రహ్మణ‍్యం శనివారం బాధ్యతలు స్వీకరించారు. 1983 బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవో తదితర కీలక బాధ్యతలు నిర్వహించారు. కాగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేసిన విషయం తెలిసిందే.