టీఆర్‌ఎస్‌లోకి మాజీ స్పీకర్ | KR Suresh Reddy joins into TRS Party | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లోకి మాజీ స్పీకర్

Sep 7 2018 12:35 PM | Updated on Mar 20 2024 4:07 PM

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ సురేష్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు.. అందులో భాగంగా సురేష్‌ రెడ్డితో కేటీఆర్‌ సమావేశమైనట్లు తెలిసింది. సురేష్‌ రెడ్డి నాలుగు సార్లు నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే బాల్కొండ నుంచి ఆర్మూర్‌  నియోజకవర్గానికి మారి గత రెండు ఎన్నికల్లో ఓడిపోయారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement