పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ ఇస్లామిక్ దేశాలని.. భారత్ సర్వ మతాల కలయిక గల సెక్యులర్ దేశమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలోని ముస్లింలను గౌరవిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్నామన్నారు. సికింద్రాబాద్‌లోని పద్మరావునగర్‌లో బీజేపీ నేతలు ఆదివారం ‘గృహ సంపర్క్ అభియాన్’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ చట్టాలపై ప్రజలను అనవసరంగా రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు.