టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ స్థానానికి నవీన్‌రావు పేరు | KCR Finalised Naveen Rao Name For MLA Quota MLC Seat | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ స్థానానికి నవీన్‌రావు పేరు

May 27 2019 5:21 PM | Updated on Mar 21 2024 8:18 PM

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి నవీన్‌రావు పేరును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ఖరారు చేశారు. గత కొంతకాలంగా ఆ స్థానానికి నల్గొండ మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి పేరును ఖరారు చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఆఖరున నవీన్‌రావు పేరును ఖరారు చేస్తూ కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గుత్తా సుఖేందర్‌ రెడ్డి మనసు నొచ్చుకోకుండా ఉండేందుకు.. త్వరలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానానికి అవకాశం కల్పిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుండి మైనంపల్లి హన్మంతరావు టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి, విజయం సాధించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement