నాలుక కోస్తా అన్నావ్‌.. ఎక్కడికి రావాలి | JC Diwakar Reddy Fires On CI Madhav,JC Diwakar Reddy Press Conference | Sakshi
Sakshi News home page

నాలుక కోస్తా అన్నావ్‌.. ఎక్కడికి రావాలి

Sep 21 2018 4:11 PM | Updated on Mar 22 2024 10:40 AM

‘నాలుక కోస్తా అన్నావ్’‌... ఎక్కడికి రావాలని పోలీసు అధికారుల సంఘం కార్యదర్శి, కదిరి సీఐ గోరంట్ల మాధవ్‌పై  టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి మండిపడ్డారు.  పోలీసులు కొజ్జాలు అంటూ జేసీ చేసిన వ్యాఖ్యలపై సీఐ మాధవ్‌ ఘాటుగా బదులిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేసీ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే తన నాలుక కోయాలని, తనపైనే మీసాలు తిప్పుతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నువ్వు ఉద్యోగం వదిలి రా.. నేను రాజకీయాలు వదిలి వస్తా.. తేల్చుకుందాం’ అని సవాల్‌ విసిరారు. ఈ నెల 25 తర్వాత తాను బయటకు వెళ్తున్నట్లు.. ఈ లోపు ఎక్కడికి రావాలో చెప్పు తాడోపేడో తెల్చుకుందామన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement