నేడు నింగిలోకి జీఎస్‌ఎల్వీ–మార్క్‌3–డీ2 రాకెట్‌ | Sakshi
Sakshi News home page

నేడు నింగిలోకి జీఎస్‌ఎల్వీ–మార్క్‌3–డీ2 రాకెట్‌

Published Wed, Nov 14 2018 8:10 AM

ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) బాహుబలిగా పేరుగాంచిన జీఎస్‌ఎల్వీ–మార్క్‌3–డీ2 రాకెట్‌ ద్వారా జీశాట్‌–29 ఉపగ్రహ ప్రయోగానికి మంగళవారం మధ్యాహ్నం 27 గంటల కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. వాతావరణం సహకరిస్తే బుధవారం సాయంత్రం సరిగ్గా 5.08 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్వీ–మార్క్‌3–డీ2 నింగిలోకి దూసుకెళ్లనుంది. గజ తుపాను కారణంగా వాతావరణం అనుకూలంగా లేకపోవడం తెలిసిందే. మొత్తంగా ఇస్రోకు ఇది 67వ అంతరిక్ష ప్రయోగం. సమాచార ఉపగ్రహమైన జీశాట్‌–29లో కేఏ, కేయూ బ్యాండ్‌ ట్రాన్స్‌పాండర్లను అమర్చారు. ఈశాన్య రాష్ట్రాలతోపాటు జమ్మూ కశ్మీర్‌ ప్రజల ఇంటర్నెట్‌ కనెక్టివిటీ తదితర అవసరాల కోసం ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement