దర్శకరత్న దాసరి నారాయణరావు చనిపోయే నాలుగు రోజుల ముందు కూడా మళ్లీ ఉదయం పేపర్ రావాలని కోరుకున్నారని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. దాసరి కోరిక మేరకు మళ్లీ ఏదో ఒక రూపంలో ‘ఉదయం’ రావాలని ఆశిస్తున్నానని చెప్పారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా దాసరి టాలెంట్ అకాడమీ ఆధ్వర్యంలో షార్ట్ ఫిలిం కాంపిటీషన్ బహుమతి ప్రదానోత్సవం హైదరాబాద్‌లో జరిగింది.